చైనా ఓపెన్ టైటిల్ కోసం అమీతుమీ
బీజింగ్: ఈ సీజన్‌లో ఏడో టైటిల్ సాధించేందుకు ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ)... నాలుగో టైటిల్‌ను దక్కించుకునేందుకు ప్రపంచ మూడో ర్యాంకర్ అల్‌కరాజ్ (స్పెయిన్) విజయం దూరంలో నిలిచారు. చైనా ఓపెన్ ఏటీపీ –500 టెన్నిస్ టోరీ్నలో వీరిద్దరు ఫైనల్లోకి దూసుకెళ్లారు.
మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో సినెర్ 6–3, 7–6 (7/3)తో యుంచాకెటె బు (చైనా)పై, అల్‌కరాజ్ 7–5, 6–3తో మెద్వెదెవ్ (రష్యా)పై నెగ్గారు. ఈ ఏడాది సినెర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 59 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించడంతోపాటు మరో నాలుగు టోరీ్నల్లో విజేతగా నిలిచాడు.
అల్‌కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సొంతం చేసుకోవడంతోపాటు ఇండియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. సినెర్, అల్‌కరాజ్ ముఖాముఖిగా ఇప్పటి వరకు 9 సార్లు తలపడ్డారు. 4 సార్లు సినెర్, 5 సార్లు అల్‌కరాజ్ గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment