బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియాను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా తొలి టెస్టుకు దూరం కాగా.. మరో స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ గాయంతో బాధపడుతూనే తన ఆటను కొనసాగిస్తున్నాడు.
అయితే తాజాగా భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా గాయం బారిన పడ్డాడు. మూడో రోజు ఆటలో బుమ్రా చేతి వేలికి గాయమైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 86వ ఓవర్‌లో లంచ్ తర్వాత భారత ఫిజియో మైదానంలో కన్పించాడు. ఈ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. బుమ్రా మధ్య వేలు కట్ అయ్యి రక్తస్రావం అవుతుందని తెలిపాడు.
గాయంతో బాధపడుతూనే ఆ ఓవర్‌ను బుమ్రా కొనసాగించాడు. ఆ తర్వాత మళ్లీ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతడి వేలికి చేప్ చేయబడి ఉంది.అయితే అతడి గాయంపై ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ లేదు.
మరి రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేస్తాడో లేదో చూడాలి. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(125), రిషబ్ పంత్(53) అగ్రస్ధానంలో ఉన్నాడు.
చదవండి: IND vs NZ: 'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment