టీమిండియా వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కట్ 9 ఏళ్ల తర్వాత తొలి వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గురువారం బార్బోడస్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి వన్డేకు భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉనద్కట్‌కు చోటు దక్కనున్నట్లు సమాచారం.
విండీస్‌తో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ దూరమయ్యాడు. మడమ నొప్పితో బాధపడుతున్న సిరాజ్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతి నిచ్చింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి కూడా ధ్రువీకరించింది. విండీస్‌తో తొలి వన్డే ఆరంభానికి ముందు ఈ మేరకు బీసీసీఐ ప్రకటన చేసింది.
ఈ క్రమంలో తొలి వన్డేలో సిరాజ్ స్ధానాన్ని ఉనద్కట్‌తో భర్తీ చేయాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉనద్కట్ చివరగా 2013లో ఇదే వెస్టిండీస్‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు భారత్ తరపున 7 వన్డేలు ఆడిన జయదేవ్.. 8 వికెట్లు పడగొట్టాడు. అతడి కెరీర్‌లో 4/41 అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలగా ఉన్నాయి.
ఇప్పుడు మరోసారి టీమిండియా తరపున సత్తా చాటేందుకు అతడికి సువర్ణ అవకాశం లభించింది. అతడితో పాటు పేస్ బౌలింగ్‌లో , శార్ధూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది. కాగా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో కూడా భాగమైన జయదేవ్ ఉనద్కట్.. రెండు టెస్టుల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు.
తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్ , జయదేవ్ ఉనద్కట్
విండీస్: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లైర్, అల్జారీ జోసెఫ్, ఒషానే థామస్, జేడెన్ సీల్స్
చదవండి: వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు టీమిండియాకు భారీ షాక్! అందుకే సిరాజ్ దూరం: బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment