దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ జెయింట్స్ జట్టులో చేరిన జాంటీ రోడ్స్.. లక్నోలోని వాజ్‌పేయ్ స్టేడియంలో తమ ఆటగాళ్లకు ఫీల్డింగ్ మెళుకువలను నేర్పిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు రోడ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూలో రోడ్స్‌కు ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరన్న ప్రశ్న ఎదురైంది. వెంటనే రోడ్స్ ఏమీ ఆలోచించకుండా వరల్డ్ క్రికెట్‌లో రవీంద్ర జడేజా బెస్ట్ ఫీల్డర్ అంటూ బదులిచ్చాడు. జడేజా ఒక గన్ ఫీల్డర్, ఫీల్డ్‌లో సూపర్ మ్యాన్‌లా ఉంటాడని రోడ్స్ తెలిపాడు. అయితే ప్రపంచక్రికెట్‌లో అద్భుతమైన ఫీల్డర్లగా పేరొందిన విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ పేర్లను రోడ్స్ ప్రస్తావించకపోవడం గమానార్హం
కాగా జడ్డూ ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు. ఎన్నో సంచలన క్యాచ్‌లను జడ్డూ అందుకున్నాడు. తన ఫీల్డింగ్ స్కిల్స్‌తో అందరని జడేజా అకట్టుకున్నాడు. జడ్డూ ప్రస్తుతం ఐపీఎల్‌కు సన్నద్దమవుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు జడేజా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 31 నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: IPL 2023: సీఎస్‌కేకు బిగ్ షాక్.. ధోని దూరం! కెప్టెన్‌గా రుత్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment