నా చేతికి ధోని జెర్సీ: బట్లర్‌ | Jos Buttler Received CSK Skipper Dhonis Jersey | Sakshi
Sakshi News home page

నా చేతికి ధోని జెర్సీ: బట్లర్‌

Published Tue, Oct 20 2020 10:30 PM | Last Updated on Thu, Oct 22 2020 4:01 PM

Jos Buttler Received CSK Skipper Dhonis Jersey - Sakshi

అబుదాబి: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు స్టార్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌కు ఎంఎస్‌ ధోని నుంచి బహుమతి లభించింది.  తన 200 వ ఐపీఎల్‌ మ్యాచ్‌ జెర్సీని బట్లర్‌కు ఇచ్చాడు ధోని. ప్రపంచ వ్యాప్తంగా ధోనికి ఎంతోమంది అభిమానులు ఉండగా అందులో బట్లర్‌ ఒకడు. తన ఫేవరెట్‌ క్రికెటరే కాకుండా ఆరాథ్య క్రికెటర్‌ ధోని అంటూ గతంలో చాలా సార్లు చెప్పాడు బట్లర్‌. 

నిన్నటి మ్యాచ్‌లో బటర్ల్‌ 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 70 పరుగుల సాధించి రాజస్తాన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును గెలుచుకున్న బట్లర్‌కు ధోని నుంచి కూడా గిఫ్ట్‌ లభించింది. అది కూడా ధోని జెర్సీ కావడం, ఒక మైలురాయి మ్యాచ్‌ జెర్సీ కావడంతో బటర్ల్‌ ఆనందానికి అవధుల్లేవు. తన ఐడల్‌ క్రికెటర్‌ నుంచి జెర్సీని అందుకున్నాననే విషయాన్ని బట్లర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పష్టం చేశాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement