PC: IPL.com
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 491 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌ల్లో మూడు భారీ సెంచరీలతో పాటు రెండు అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో 11 ఏళ్ల నాటి క్రిస్ గేల్ రికార్డును జోస్ బట్లర్ బద్దలు కొట్టాడు. క్యాష్ రిచ్ లీగ్-2011 సీజన్‌లో యూనివర్స్ బాస్ తన మొదటి ఏడు మ్యాచ్‌లలో 436 పరుగులు చేసిన రికార్డు కలిగి ఉన్నాడు.
తాజా సీజన్‌లో బట్లర్ తొలి 7 మ్యాచ్‌ల్లో 491 పరుగులు సాధించి గేల్ రికార్డును అధిగమించాడు. దీంతో తొలి 7 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా బట్లర్ నిలిచాడు.ఐపీఎల్ సీజన్‌లోని మొదటి ఏడు మ్యాచ్‌ల్లో 400 పైగా పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ ,డేవిడ్ వార్నర్ ఉన్నారు.. మరో వైపు ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లి రికార్డును కూడా బట్లర్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఐపీఎల్-2016లో కోహ్లి 4 సెంచరీలతో పాటు 973 పరుగులు సాధించాడు.
చదవండి: IPL 2022: ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్‌సీబీ లైవ్ అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment