న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొన్నాడు. ఏడాది కాలానికి(2024-25)గానూ తాను బ్లాక్‌కాప్స్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.
అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు విలియమ్సన్ తెలిపాడు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
గౌరవిస్తున్నాం
విలియమ్సన్ నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొన్నా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ మ్యాచ్‌లకు మాత్రం అందుబాటులోనే ఉంటానని అతడు చెప్పినట్లు తెలిపింది. తమ అత్యుత్తమ బ్యాటర్‌కు ఈ వెసలుబాటు కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది.
కాగా టీ20 ప్రపంచకప్-2024లో న్యూజిలాండ్ చేదు అనుభవం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో నాలుగింట రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన విలియమ్సన్ బృందం.. సూపర్-8కు కూడా చేరకుండానే నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో కెప్టెన్ విలియమ్సన్ టీ20 కెరీర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఇప్పట్లో రిటైర్ కాబోనని మాత్రం చెప్పాడు. అయితే, అనూహ్యంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.
అందుకే ఈ నిర్ణయం
విదేశీ లీగ్(టీ20)లలో అవకాశాలు అందిపుచ్చుకోవడం, కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేన్ విలియమ్సన్ కివీస్ బోర్డుకు వెల్లడించాడు.
సుదీర్ఘకాలం పాటు న్యూజిలాండ్‌కు సేవలు అందించే క్రమంలో.. తన కెరీర్‌ను పొడిగించుకునేందుకే ఏడాది కాలం పాటు దూరంగా ఉండనున్నట్లు తెలిపాడు.
కాగా 2024-2025 ఏడాదికి గానూ కివీస్‌కు ద్వైపాక్షిక సిరీస్‌లు తక్కువే ఉన్నాయి. అయితే, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరాలంటే మాత్రం కీలక మ్యాచ్‌లలో గెలుపొందాల్సిన అవసరం ఉంది.
సరికొత్త ఉత్సాహంతో తిరిగి వస్తాడు
ఈ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ టెస్టులకు మాత్రం అందుబాటులో ఉండేందుకు సమ్మతించడం గమనార్హం. ఈ ఏడాది నవంబరులో సొంతగడ్డపై కివీస్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
ఇక కేన్ విలియమ్సన్ నిర్ణయం గురించి న్యూజిలాండ్ బోర్డు సీఈవో మాట్లాడుతూ.. దిగ్గజ ఆటగాడి అభ్యర్థన పట్ల తాము సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. తమ అత్యుత్తమ బ్యాటర్ త్వరలోనే తిరిగి సరికొత్త ఉత్సాహంతో జట్టుతో చేరతాడని పేర్కొన్నారు.
చదవండి: శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ.. జింబాబ్వే టీ20 సిరీస్‌కు ఐపీఎల్ హీరోలు!
Comments
Please login to add a commentAdd a comment