Kidambi Srikanth.. హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 15వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–15, 21–10తో43వ ర్యాంకర్ కొకి వతనాబె (జపాన్)పై గెలిచాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ (భారత్) 21–16, 17–21, 7–21తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment