Ind Vs WI, 2nd ODI: Kyle Mayers Plays Nonchalant No-Look Flick-Pull For Six - Sakshi
Sakshi News home page

IND vs WI: బంతిని చూడకుండా భారీ సిక్సర్‌.. షాక్‌ తిన్న టీమిండియా బౌలర్‌! వీడియో వైరల్‌

Published Mon, Jul 31 2023 9:27 AM | Last Updated on Mon, Jul 31 2023 10:06 AM

 Kyle Mayers plays nonchalant no look flick pull for six - Sakshi

టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచిన విండీస్‌.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం​ చేసింది. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన కరేబియన్‌ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో కూడా దుమ్మురేపింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా విండీస్‌ బౌలర్లు చెలరేగడంతో 40.5 ఓర్లలోనే 181 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్‌ నిర్ధేంచిన 182 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ 4 వికెట్లు కోల్పోయి సునయాసంగా ఛేదించింది. విండీస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ హోప్‌ (63 నాటౌట్‌), కార్టీ(48) పరుగులతో రాణించారు. 

విండీస్‌ బ్యాటర్‌ సూపర్‌ సిక్సర్‌..
ఇక విండీస్‌ విజయంలో ఆ జట్టు ఓపెనర్‌ కైల్‌ మైర్స్‌ తన వంతు పాత్ర పోషించాడు. 28 బంతుల్లో 36 పరుగులు సాధించి తన జట్టుకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ క్రమంలో మైర్స్‌ ఓ అద్భుతమైన షాట్‌తో మెరిశాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ 9 ఓవర్‌ వేసిన శార్ధూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో మైర్స్‌ బంతిని చూడకుండానే భారీ సిక్సర్‌ బాదాడు.

ఇది చూసిన శార్ధూల్‌ తెల్లముఖం వేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో శార్ధూల్‌ మూడు వికెట్లు పడగొట్టి తన వంతు న్యాయం చేశాడు.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement