కొలంబో వేదికగా శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ రెండో రోజు ఆటను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలో ఉడుము ప్రత్యక్షమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 48 ఓవర్ వేసిన పేసర్ నిజత్ మసూద్ బౌలింగ్‌లో నాలుగో బంతిని ఎదుర్కోవడానికి దినేష్ చండిమాల్ సిద్ధమయ్యాడు.
అయితే బౌండరీ రోప్ వద్ద ఒక్కసారిగా ఉడుము కన్పించింది. బిగ్ స్క్రీన్‌లో ఉడుమును చూసిన అంపైర్ ఆటను కాసేపు నిలిపివేశాడు. వెంటనే మైదాన సిబ్బంది దాన్ని అక్కడినుంచి బయటకి పంపించారు. దీంతో తిరిగి మళ్లీ ఆట ప్రారంభమైంది.
ఇందుకు సబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శ్రీలంక మైదానాల్లో సరృసృపాలు ప్రత్యక్షం కావడం ఇదేమి తొలిసారి కాదు. గతేడాది శ్రీలంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా వరుసగా రెండు మ్యాచ్‌లకు పాము హాజరై కలకలం రేపింది.
చదవండి: #Angelo Mathews: ఏంటి అన్న నీకే ఎందుకు ఇలా? ఫోర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment