క్రికెట్‌ను ఎక్కడైనా ఆడుకోవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి గల్లీ క్రికెట్ దాకా చాలా చూశాం. అయితే కదులుతున్న షిప్‌లో క్రికెట్ ఆడడమే వింత అనుకుంటే.. బంతికి తాడు కట్టి ఆడడం మరో విశేషం. ఎందుకంటే నడి సముద్రంలో కదులుతున్న షిప్‌లో క్రికెట్ ఆడినా.. భారీ షాట్లు కొడితే బంతి వెళ్లి సముద్రంలో పడడం ఖాయం. దీంతో ప్రతీసారి కొత్త బంతితో ఆడాల్సి వస్తోంది.
అయితే ఇక్కడ మాత్రం షిప్‌లో క్రికెట్ ఆడిన కొందరు వ్యక్తులు తమ మెదుడుకు పదును పెట్టారు. బంతికి తాడు కట్టి క్రికెట్ ఆడారు. అప్పుడు భారీ షాట్లు కొట్టినా.. బంతి సముద్రంలో పడినా.. తాడు సాయంతో మళ్లీ వెనక్కి తెచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో.. అంటూ కామెంట్ చేశారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 15, 2023
Comments
Please login to add a commentAdd a comment