ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కావడానికి మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది ఆఖరిలో ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 సీజన్‌లో భాగంగా ఈ బీజీటీ ట్రోఫీ జరగనుంది.
అయితే 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. గత రెండు పర్యాయాలు వారి సొంత గడ్డపై కంగారులను చిత్తు చేసిన ఈ సారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు 2014 తర్వాత ఒక్కసారి కూడా బోర్డర్- గవస్కర్ ట్రోఫీ గెలవలేకపోయిన ఆసీస్.. ఈ సారి ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని భావిస్తోంది.
విజేత ఎవరో చెప్పేసిన షమీ..?
ఇక క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వార్షిక అవార్డుల వేడుకల్లో పాల్గోనున్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకు బీజీటీ-2024కు సంబంధించి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ఏడాది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విజేతగా ఎవరు నిలుస్తారో ఎంచుకోమని షమీని అడిగారు. వెంటనే మేము ఫేవరెట్స్, వారే భయపడాలి అంటూ షమీ బదులిచ్చాడు.
అదే విధంగా తన రీ ఎంట్రీ కోసం మాట్లాడుతూ.. " రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. త్వరలోనే మైదానంలో అడుగుపెడతా. పునరాగమనం చేశాక ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నాను. నేను ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది అని చెప్పుకొచ్చాడు. కాగా షమీ ప్రస్తుతం చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు తిరిగి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.
చదవండి: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. రోహిత్ మాస్టర్ ప్లాన్! ఇక చుక్కలే?
Comments
Please login to add a commentAdd a comment