మహ్మద్‌ షమీ అరుదైన ఘనత.. అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు | Ind vs NZ World Cup 2023: Mohammed Shami picks wicket on his first ball | Sakshi
Sakshi News home page

IND vs NZ World Cup 2023: మహ్మద్‌ షమీ అరుదైన ఘనత.. అనిల్‌ కుంబ్లే రికార్డు బద్దలు

Published Sun, Oct 22 2023 4:00 PM | Last Updated on Sun, Oct 22 2023 4:45 PM

Mohammed Shami picks wicket on his first ball - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023ను టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ అద్బతమైన ఓవర్‌తో ప్రారంభించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో షమీకి చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో తన వేసిన మొట్టమొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్‌ ఓపెనర్‌ విల్‌ యంగ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్‌కప్‌లో వచ్చిరాగానే షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా షమీ నిలిచాడు.

షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్‌లో 32 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లే(32)ను షమీ అధిగమించాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ 44 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు.
చదవండి: WC 2023: శ్రేయస్‌ అయ్యర్‌ సూపర్‌ క్యాచ్‌.. బిత్తరపోయిన కాన్వే! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement