Ind vs Aus: Mohammed Shami sends Peter Handscombs stump cartwheeling - Sakshi
Sakshi News home page

IND vs AUS: షమీ సూపర్‌ డెలివరీ.. దెబ్బకు ఆసీస్‌ బ్యాటర్‌ మైండ్‌ బ్లాంక్‌! వీడియో వైరల్‌

Published Thu, Mar 9 2023 3:52 PM | Last Updated on Thu, Mar 9 2023 4:08 PM

Mohammed Shami sends Peter Handscombs Stumps flying - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బ్యాటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ను ఓ సంచలన బంతితో షమీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 71 ఓ‍వర్‌ వేసిన షమీ బౌలింగ్‌లో నాలుగో బంతిని హ్యాండ్స్‌కాంబ్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో పడ్డ బంతి బ్యాట్‌ను మిస్స్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది.

దీంతో బ్యాటర్‌ చేసేది ఏమీ లేక క్రీజులో అలా ఉండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. కాగా ఇదే ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ను కూడా షమీ ఓ అద్భుతమైన బంతితో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇప్పటివరకు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ నిలకడగా ఆడుతోంది. 75 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి ఆసీస్‌ 191 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(80) సెంచరీ దిశగా ప్రయాణిస్తున్నాడు.

చదవండి: PSL 2023: క్రికెట్‌ చరిత్రలోనే అతి పెద్ద సిక్స్‌.. స్టేడియం బయటికి బంతి! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement