ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అతడి స్ధానంలో యువ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్‌కు చోటు ఇచ్చారు. గత రెండేళ్లగా వన్డే ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టడాన్ని పలువురు మాజీలు తప్పుబడుతున్నారు.
ఇంగ్లండ్‌తో వన్డేలకు కూడా సిరాజ్‌ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోతే సిరాజ్ తిరిగి మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంతో సిరాజ్ మరో ఐదు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు.
ఈ క్రమంలో హైదరాబాదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌లో హైదరాబాద్ తరఫున ఓ మ్యాచ్ ఆడనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియాతో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో ఐదు టెస్టు మ్యాచ్‌లాడిన సిరాజ్... పని భారం కారణంగా ఈ నెల 23 నుంచి హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
అయితే గ్రూప్ దశలో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగనున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరాజ మోస్తారు ప్రదర్శన కనబరిచాడు. ఐదు టెస్టుల్లో మొత్తంగా 20 వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు.
అందుకే పక్కన పెట్టాము: రోహిత్ శర్మ
కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. కొత్త బంతి, పాత బంతితో ప్రభావం చూపే బౌలర్ తమకు కావాలని, అందుకే సిరాజ్ స్ధానంలో అర్ష్‌దీప్‌కు ఛాన్స్ ఇచ్చామని రోహిత్ చెప్పుకొచ్చాడు.
బంతి పాతబడినప్పుడు మహమ్మద్ సిరాజ్ ప్రభావం తగ్గుతుందని భారత కెప్టెన్ పేర్కొన్నాడు. ఇక పాక్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరగనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ఇంగ్లండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టు
రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా.
ఇంగ్లండ్‌తో టీ20లకు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్).
భారత్‌తో వన్డేలకు/చాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లండ్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
చదవండి: పొట్టి ప్రపంచకప్‌లో పెను సంచలనం.. న్యూజిలాండ్‌కు షాకిచ్చిన పసికూన
Comments
Please login to add a commentAdd a comment