PC: IPL.com
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 5000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఏడో బ్యాటర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగులు చేసిన మిస్టర్ కూల్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా తలైవా వరుసగా రెండు సిక్సర్లు బాది ఈ రికార్డును సాధించాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా ధోని నిలిచాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(6706) పరుగులతో తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(6086) పరుగులతో ఉన్నారు.
చదవండి: IPL 2023- MS DHONI: ధోనితో అట్లుంటది మరి.. వరుసగా రెండు సిక్సర్లు! వీడియో వైరల్
A treat for the Chennai crowd! 😍@msdhoni is BACK in Chennai & how 💥#TATAIPL | #CSKvLSG
— IndianPremierLeague (@IPL) April 3, 2023
WATCH his incredible two sixes 🔽 pic.twitter.com/YFkOGqsFVT
Comments
Please login to add a commentAdd a comment