IPL 2023: MS Dhoni Happy To Play Finisher's Role In Limited Opportunities For CSK - Sakshi
Sakshi News home page

IPL 2023: అతడిని బాగా మిస్‌ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని

Published Thu, May 11 2023 8:28 AM | Last Updated on Thu, May 11 2023 10:40 AM

MS Dhoni happy to play finishers role in limited opportunities  - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కేవలం 140 పరుగులకే పరిమితమైంది.

ఇక సీఎస్‌కే విజయంలో మతీషా పతిరానా, చాహర్‌, రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరో సారి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. కేవలం 9 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోనీ.. 2 సిక్స్‌లు, ఒక ఫోరుతో 20 పరుగులు చేశాడు. ఈ విజయంపై మ్యాచ్‌ అనంతరం ధోని స్పందిచాడు. తమ గెలుపుకు కారణం బౌలర్లే అని మిస్టర్‌ కూల్‌ తెలిపాడు.

అతడిని బాగా మిస్‌అవుతున్నాము
"మ్యాచ్‌ సెకెండ్‌ హాఫ్‌లో పిచ్‌ స్పిన్నర్లకు బాగా అనూకూలించింది. మా జట్టులో వరల్డ్‌క్లాస్‌ స్పిన్నర్లు ఉన్నారు. వారు బంతిని ఇటువంటి వికెట్‌పై అద్భుతంగా టర్న్‌ చేయగలరు. ఇటువంటి పిచ్‌పై  మేము సాధించిన స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవచ్చని నేను భావించాను.

కేవలం వికెట్లు కోసం మాత్రమే ప్రయత్నించకండి, డాట్‌ బాల్స్‌ వేస్తే చాలు అని మా బౌలర్లకు ముందే చెప్పాను. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇక బ్యాటింగ్‌లో ఒక యూనిట్‌గా రాణించడంలో  కాస్త విఫలమయ్యాం.

ఈ మ్యాచ్‌లో మొయిన్, జడ్డూకి బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. కానీ మొయిన్‌ కాస్త నిరాశపరిచాడు. మేము టోర్నమెంట్ చివరి దశలో ఉన్నాం. కాబట్టి ప్రతీ బ్యాటర్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రావాలి. ఇక మిచెల్‌ సాంట్నర్‌ను మేము బాగా మిస్‌ అవుతున్నాము. అతడు కొత్త బంతితో ఫ్లాట్ పిచ్‌లపై అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు.

కానీ జట్టులో ఇప్పటికే ముగ్గురు లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్లు ఉండడంతో అతడికి అవకాశం దక్కడం లేదు.  ఇక రుత్‌రాజ్‌ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మాకు అతడు అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆకట్టుకుంటాడు. అటువంటి ఆటగాళ్లు జట్టులో ఉండాలి.

రుత్‌రాజ్‌ వంటి ఆటగాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఇక నా వంతు ఫినిషింగ్ రోల్ పోషించడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎక్కువగా పరుగెత్తే అవకాశమివ్వద్దని మా బాయ్స్‌కు ముందే చెప్పా. అది వర్క్ అవుతుంది కూడా" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో ధోని పేర్కొన్నాడు.


చదవండి: ODI WC 2023: అదృష్టం కలిసొచ్చింది.. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement