ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను దూరదృష్టం వెంటాండింది. తొలి ఇన్నింగ్స్‌లో విచిత్రకర రీతిలో హ్యారీ బ్రూక్ ఔటయ్యాడు. 35 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.
ఏం జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ మంచి టచ్‌లో కన్పించాడు. వరుసగా ఫోర్లు బాది ఆసీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో బ్రూక్‌ను అపేందుకు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పిన్నర్ నాథన్ లియాన్‌ను బౌలింగ్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో 38 ఇన్నింగ్స్ ఓవర్‌లో నాథన్ లియాన్ వేసిన ఆఫ్-బ్రేక్ డెలివరీని.. బ్రూక్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
అయితే బంతి థైపాడ్‌కు తాకి కొంచెం గాల్లోకి లేచింది. బంతి ఎటువైపు తెలియక బ్యాటర్ తికమకపడ్డాడు. అయితే చాలా సేపు గాల్లో ఉన్న బంతి కింద పడి బ్రూక్ వెనుక కాలికి తగిలి స్టంప్స్‌ను గిరాటేసింది. ఏం జరిగిందో తెలియక నిరాశతో బ్రూక్ పెవిలియన్‌కు చేరాడు.
చదవండి: Ashes 2023: తొలి బంతికే ఫోర్ కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్.. కెప్టెన్ స్టోక్స్ రియాక్షన్ వైరల్
A freak dismissal.
— England Cricket (@englandcricket) June 16, 2023
Live clips/Scorecard: https://t.co/TZMO0eJDwY pic.twitter.com/cIUQaANJ2x
Comments
Please login to add a commentAdd a comment