అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ మహిళల జట్టుతో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి జట్టులోకి వచ్చింది.
అదేవిధంగా యవ పేసర్ ప్రియా మిశ్రా ఈ మ్యాచ్‌తో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌కు రేణుకా సింగ్, హేమలతకు భారత జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మరోవైపు కివీస్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కేర్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైంది.
ఆమెతో పాటు మోలీ పెన్ఫోల్డ్ కూడా రెండో వన్డేకు దూరమైంది. ఈ క్రమంలో వీరిద్దిరి స్ధానాల్లో జట్టులోకి తహుహు, జోన్స్ వచ్చారు. కాగా తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
తుది జట్లు
భారత్: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యస్తికా భాటియా(వికెట్ కీపర్), హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా
న్యూజిలాండ్: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, లారెన్ డౌన్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మాడీ గ్రీన్, ఇసాబెల్లా గాజ్(వికెట్ కీపర్), జెస్ కెర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్
Comments
Please login to add a commentAdd a comment