Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Former Minister Kakani Govardhan Reddy Arrest1
కూటమి సర్కార్‌ అక్రమ కేసు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్‌

సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాకాణిపై మైనింగ్ పేరుతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెండు నెలలుగా పోలీసులు టార్గెట్ చేశారు.రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి.. చంద్రబాబు సర్కార్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పొదలకురు మండలం రుస్తుం మైన్ కేసులో కాకాణిని పోలీసులు ఇరికించారు. ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు దోపిడీ విధానాలను విమర్శించినందుకు కక్ష కట్టిన ప్రభుత్వం.. మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్‌ని బయటపెట్టినందుకు ఎదురు కేసులు పెట్టించి వేధిస్తోంది.

Ysrcp Sensational Tweet On Vijayasai Reddy2
వీడియో వైరల్‌: టీడీపీ కీలక నేతతో విజయసాయిరెడ్డి రహస్య భేటీ

సాక్షి, తాడేపల్లి: విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు ఉన్నాయంటూ వీడియోతో సహా వైఎస్సార్‌సీపీ సంచలన ట్వీట్‌ చేసింది. టీడీపీ కీలకనేత టీడీ జనార్ధన్‌ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశం జరిగింది. తాడేప‌ల్లి పార్క్ విల్లాలో విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి వచ్చారు.. 13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు చంద్రబాబు న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌ వచ్చారు. 45 నిమిషాల పాటు ర‌హ‌స్య మంత‌నాలు జరిపారు’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.‘‘విచార‌ణ ముగిసిన వెంట‌నే మీడియా ముందు వైఎస్‌ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు, విష‌పు వ్యాఖ్య‌లు.. విజ‌య‌సాయిరెడ్డిని వైఎస్‌ జ‌గ‌న్ న‌మ్మి.. ద‌గ్గ‌ర పెట్టుకుని పార్టీలో క్రియాశీల‌క ప‌ద‌వుల‌తో పాటు రాజ్య‌స‌భకు పంపించి గౌర‌విస్తే ఇంకా మూడేళ్లు ప‌ద‌వీ కాలం ఉన్నా చంద్ర‌బాబుకు మేలు చేసేందుకు విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేశారు. ఇది న‌మ్మ‌కం ద్రోహం కాదా?’’ అంటూ ఎక్స్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ నిలదీసింది.విజ‌య‌సాయిరెడ్డి అమ్ముడు పోయాడ‌న‌డానికి ప‌క్కా ఆధారాలు..మ‌ద్యం కుంభ‌కోణంపై సీఐడీ విచార‌ణ‌కు కొన్ని గంట‌ల ముందు ర‌హ‌స్య స‌మావేశంతాడేప‌ల్లి పార్క్ విల్లాలో..విల్లా నెం 27కు సాయంత్రం 5:49కు విజ‌య‌సాయిరెడ్డి13 నిమిషాల త‌ర్వాత అదే విల్లాకు @ncbn న‌మ్మిన‌బంటు టీడీ జ‌నార్ధ‌న్‌.… pic.twitter.com/XYgtZsJSE4— YSR Congress Party (@YSRCParty) May 25, 2025

Pakistan regard India as an existential threat says on US dia report3
సంచలన నివేదిక, భారత్‌ టార్గెట్‌గా.. అణ్వాయుధాలను అప్‌డేట్‌ చేస్తున్న పాక్‌

వాషింగ్టన్‌: ఏప్రిల్​ 22న జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి, ప్రతీకారంగా భారత్​ చేపట్టిన ఆపరేషన్​ సిందూర్​ విజయవంతమైన నేపథ్యంలో అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (డీఐఏ) సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్‌ తన అస్తిత్వానికి పాక్‌ ముప్పుగా భావిస్తుందని, అందుకే దాయాది దేశం తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తుందనేది డీఐఏ నివేదిక సారాంశం. 2025 worldwide threat assessment report పేరుతో డీఐఏ రిపోర్టును విడుదల చేసింది. అందులో భారత్‌ను ఇప్పటికీ పాక్ తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని.. అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పాక్ విదేశీ సరఫరాదారుల, మధ్యవర్తుల ద్వారా భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను weapons of mass destruction (WMDs) సంపాదిస్తుందని, ఆ అణు పదార్ధాలతో పాటు, అందుకు కావాల్సిన సాంకేతికతను చైనా నుండి పొందుతుందని తెలిపింది. వీటి ట్రాన్స్‌ఫర్ హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ద్వారా జరుగుతోందని హైలెట్‌ చేసింది. భారత్‌పై అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక డీఏఐ తన నివేదికలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో దాడిచేసింది. మే 7 నుండి 10 వరకు రెండు దేశాలూ క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. మే 10 నాటికి రెండు సైనిక బలగాలు పూర్తి కాల్పుల విరమణపై అంగీకరించాయి’ అని డీఐఏ తన నివేదికలు తెలిపింది.

PM Modi Advises BJP Leaders on Remarks About Operation Sindoor4
నోటి దురుసు వ్యాఖ్యలు చేయొద్దు.. నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్‌

సాక్షి,ఢిల్లీ: బీజేపీ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికలు జారీ చేశారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే విషయంలో నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆదివారం ఢిల్లీలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో నేతలు నిర్లక్ష్యంగా వ్యాఖ్యలు చేయొద్దని మోదీ వార్నింగ్‌ ఇచ్చారు. వివాదాస్పద విషయాలపై మౌనంగా ఉండాలని తెలిపారు. ప్రజా సమక్షంలో నాయకులు చేసే వ్యాఖ్యల్లో అణుకువ, బాధ్యత ఉండాలని హితవు పలికారు. ఎక్కడైనా, ఏదైనా మాట్లాడవచ్చు అనే ధోరణికి దూరంగా ఉండాలని, అనవసర వ్యాఖ్యలు పార్టీకి ప్రతికూలంగా మారతాయని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’పై చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని పేర్కొన్నారు. PM Narendra Modi tweets, "Participated in the NDA Chief Ministers' Conclave in Delhi. We had extensive deliberations about various issues. Various states showcased their best practices in diverse areas, including water conservation, grievance redressal, strengthening… pic.twitter.com/9Hd03QrWXG— ANI (@ANI) May 25, 2025మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‌ డిప్యూటీ సీఎం జగదీష్‌ దేవ్‌డా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ‘యావత్తు దేశ ప్రజలు, జవాన్లు తలలు వంచి ప్రధాని మోదీ పాదాల వద్ద మోకరిల్లారు. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పాకిస్తాన్ జవాబిచ్చిన తీరును ప్రశంసించడానికి మాటలు చాలవు అని వ్యాఖ్యానించారు. ఇలా ఆపరేషన్‌ సిందూర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాజా, ఎన్డీయే సమావేశంలో బీజేపీ నేతలకు ప్రధాని మోదీ పై ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్డీయే సమావేశంలో ఆపరేషన్ సిందూర్‌పై స్పష్టత ఇచ్చిన మోదీ.. కాల్పుల విరమణ ఒప్పందంలో దేశానిదే తుది నిర్ణయం. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు సీజ్‌ఫైర్‌కు అంగీకరించాం. భారత్‌-పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందంలో మరే ఇతర దేశం జోక్యం చేసుకోలేదన్నారు.

IPL Chennai Super Kings beat Gujarat Titans by 83 runs5
సీఎస్‌కే ఆల్‌రౌండ్ షో.. కీల‌క మ్యాచ్‌లో గుజ‌రాత్ చిత్తు

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ అద్బుత‌మైన విజ‌యంతో ముగించింది. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 83 ప‌రుగుల తేడాతో సీఎస్‌కే చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జ‌ట్టు ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 230 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌(23 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 57), డెవాన్ కాన్వే(35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) సూప‌ర్‌ హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగ‌గా.. ఆయూష్ మాత్రే(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 34), ఉర్విల్ ప‌టేల్‌(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 37) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయికిషోర్‌, రషీద్ ఖాన్‌, షారుఖ్ ఖాన్ తలా వికెట్ సాధించారు.సుద‌ర్శ‌న్ ఒక్క‌డే..అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌లో సీఎస్‌కే బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో గుజ‌రాత్‌.. 18.3 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ సాయిసుద‌ర్శ‌న్‌(41) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ 13 ప‌రుగులు చేయ‌గా.. స్టార్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ కేవ‌లం 5 ప‌రుగులు మాత్ర‌మే చేసి నిరాశ‌ప‌రిచారు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో అన్షుల్ కాంబోజ్‌, నూర్ అహ్మ‌ద్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి గుజ‌రాత్‌ను దెబ్బ‌తీయ‌గా.. ర‌వీంద్ర జ‌డేజా రెండు, ప‌తిరానా, ఖాలీల్ అహ్మ‌ద్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.కాగా ఈ ఓట‌మితో గుజ‌రాత్ టైటాన్స్ టాప్-2 స్దానం ప్రమాదంలో ప‌డింది. ఆర్సీబీ, పంజాబ్ త‌మ త‌దుప‌రి రెండు మ్యాచ్‌ల‌లో గెలిస్తే గుజ‌రాత్ మూడో స్ధానానికి ప‌డిపోతుంది.చదవండి: IPL 2025: ప్లే ఆఫ్స్‌కు ముందు పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Claims They Break Two Laws of Money and Why Are People Poor6
'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి

అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరగబోతోంది, ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, బంగారం రూ.21 లక్షలకు చేరుతుందని చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసా'కి తాజాగా చాలా మంది ప్రజలు పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.రాబర్ట్ కియోసాకి రెండు ఆర్థిక సూత్రాలను ''గ్రేషమ్స్ లా, మెట్‌కాల్ఫ్ లా'' గురించి వివరిస్తూ.. ప్రజలు పేదవారు కావడానికి కారణాలను చెప్పారు. 'డబ్బును పొదుపు చేసేవారు ఓడిపోతారు' అని పేర్కొన్నారు.గ్రేషమ్స్ లా ప్రకారం.. 'చెడు డబ్బు వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు.. మంచి డబ్బు దాగిపోతుంది'. ఎలా అంటే యూఎస్ డాలర్ లేదా భారతీయ రూపాయి వంటివి కాలక్రమేణా విలువను కోల్పోయే అవకాశం ఉంది. నిజమైన డబ్బును ఆదా చేయాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి.మెట్‌కాల్ఫ్ లా అనేది.. నెట్‌వర్క్స్. దీనికి ఉదాహరణగా ''మెక్‌డొనాల్డ్స్ ఒక ఫ్రాంచైజ్ నెట్‌వర్క్. మామ్ పాప్ బర్గర్స్ అనేది కాదు. ఫెడెక్స్ ఒక నెట్‌వర్క్. జో వన్-ట్రక్ డెలివరీ అనేది కాదు'' అని కియోసాకి వివరిస్తూ.. నేను బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడతాను ఎందుకంటే అది ఒక నెట్‌వర్క్.. అయితే చాలా క్రిప్టోలు కాదని అన్నారు. మీరు ధనవంతులు కావాలనుకుంటే.. చట్టాలను పాటించండి అని కియోసాకి చెప్పారు.ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..''వస్తువులలో మాత్రమే పెట్టుబడి పెట్టండి, ధనవంతుడు మీ నుంచి కొనుగోలు చేస్తాడు'' అనే మైఖేల్ సాయిలర్ మాటలను రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. నేను యూఎస్ డాలర్లను ఆదా చేయను, ఎందుకంటే పొదుపు అనేది గ్రేషమ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. అలాగే నేను నెట్‌వర్క్‌లు లేని చెత్త నాణేలలో పెట్టుబడి పెట్టను, ఎందుకంటే అవి మెట్‌కాల్ఫ్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి. అందుకే నేను బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల మీదనే పెట్టుబడి పెడతాను. అయితే ఈ చట్టాలని పాటించాలంటే జాగ్రత్త కూడా వహించాలని ఆయన అన్నారు.ARE YOU BREAKING the LAWS?Most poor people are poor…. because they break the 2 most important laws of money.LAW #1: GRESHAM’s LAW: “When bad money enters a system….good money goes into hiding”In Rich Dad Poor Dad….I stated….“ Savers are losers.” In 2025 poor people…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2025

tollywood producer allu aravind Comments on Theatres Issue7
నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఆ నలుగురితో కలపకండి: అల్లు అరవింద్

సినిమా థియేటర్ల వివాదంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. థియేటర్ల మూసివేత అనేది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఏపీలో 1500 థియేటర్లు ఉంటే తనవి కేవలం 15 మాత్రమే ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో తనకు కేవలం ఒక్క థియేటర్‌ మాత్రమే ఉందన్నారు. స్టాండ్‌ అలోన్ థియేటర్లకు సమస్యలు ఉన్న మాట వాస్తవమేనని అల్లు అరవింద్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు కూర్చుని మాట్లాడుకోవాలని.. ఏకపక్షంగా వెళ్లడం సరికాదన్నారు.అల్లు అరవింద్ మాట్లాడుతూ..'రెండు రోజుల నుంచి ఆ నలుగురు అనే వార్తలు వస్తున్నాయి. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురు అనేది 10 సంవత్సరాలక్రితం ఇప్పుడు 10 మంది పైనే ఉ‍న్నారు. తెలంగాణలో నాకు ఉన్న ఒక్క థియేటర్ ట్రిపుల్ ఏ సినిమాస్ మాత్రమే. ఏపీలో కూడా 15 థియేటర్ల లోపు మాత్రమే నా దగ్గర ఉన్నాయి. థియేటర్లకు సంబంధించి జరిగిన మూడు సమావేశాలకు నేను వెళ్లలేదు. దయచేసి ఆ నలుగురిలో నన్ను కలపకండి.' అని అన్నారు.

Jayesh Ranjan Reaction To Miss England Comments8
ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవం: జయష్‌ రంజన్‌

సాక్షి, హైదరాబాద్‌: మిస్ ఇంగ్లాండ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఆమెను వేశ్యలా చూశారన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. ఆమె వ్యాఖ్యలు నిరాధారమన్నారు. తెలంగాణ ఆతిథ్యం నచ్చిందని ఆమె చెప్పారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని పోటీ నుంచి తప్పుకున్నారు. ఆమె పట్ల ఎవరు తప్పుగా ప్రవర్తించలేదు’’ అని జయేష్‌ రంజన్‌ చెప్పారు.‘‘నేను మిస్ వరల్డ్ నిర్వాహకులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆమె కేవలం చౌమహల్లా ప్యాలస్ డిన్నర్‌లో మాత్రమే పాల్గొంది. ప్రతి టేబుల్‌లో పురుషులు, మహిళలు అందరూ ఉన్నారు. ఆమె తోటి పోటీదారులను కూడా విచారించాం. అలాంటిది జరగలేదని చెప్పారు’’ అని జయేష్‌ రంజన్‌ పేర్కొన్నారు.మిస్‌ వరల్డ్‌ వివాదం.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..మరోవైపు, మిస్‌ వరల్డ్‌ వివాదంపై తెలంగాణ సర్కార్‌ విచారణకు ఆదేశించింది. మిస్‌ వరల్డ్‌ పోటీలపై మిస్‌ ఇంగ్లాండ్‌ మిల్లా మాగీ చేసిన ఆరోపణలపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి షికా గోయల్‌, ఐపీఎస్‌ రమా రాజేశ్వరి, సైబరాబాద్‌ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. మిస్ ఇంగ్లాండ్‌ ఆరోపణల్లో నిజమెంత? మిస్ వరల్డ్ కంటెస్టెంట్‌లు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా? అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వివాదంపై పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.

RJD chief Lalu Prasad Yadav expels son Tej Pratap9
అనుష్కతో సన్నిహితంగా పెద్ద కుమారుడు.. లాలూ సంచలన నిర్ణయం

పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితం తన పెద్ద కుమారుడు తేజ ప్రతాప్‌ యాదవ్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. తేజ్‌ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజ్‌ ప్రతాప్‌ను పార్టీ నుంచి బహిష్కరణకు కారణం శనివారం ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ఆ సోషల్‌ మీడియా పోస్టే లాలూ కుటుంబంలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. निजी जीवन में नैतिक मूल्यों की अवहेलना करना हमारे सामाजिक न्याय के लिए सामूहिक संघर्ष को कमज़ोर करता है। ज्येष्ठ पुत्र की गतिविधि, लोक आचरण तथा गैर जिम्मेदाराना व्यवहार हमारे पारिवारिक मूल्यों और संस्कारों के अनुरूप नहीं है। अतएव उपरोक्त परिस्थितियों के चलते उसे पार्टी और परिवार…— Lalu Prasad Yadav (@laluprasadrjd) May 25, 2025శనివారం తేజ్‌ ప్రతాప్‌ ఫేస్‌బుక్‌లో అకౌంట్‌లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ఆ ఫొటోలో తేజ్‌ ప్రతాప్‌ ఓ యువతితో సన్నిహితంగా ఉన్నారు. ఆ యువతి పేరు అనుష్క యాదవ్‌ అని, తాము గత 12ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. ఆ పోస్టుపై దుమారం చెలరేగడంతో కొద్ది సేపటికే దానిని డిలీట్‌ చేశారు. తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్‌ చేశారన్నారు. ఆ పోస్టు తాను చేయలేదని స్పష్టం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. గతంలో, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌, అనుష్క యాదవ్‌ సన్నిహితంగా ఉన్న ఫొటోలు,వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ये वीडियो भी फेक है? 🤔 pic.twitter.com/XdTgZHbZ8b— Ankur Singh (@iAnkurSingh) May 24, 2025దీంతో తన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ప్రకటనపై లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మండిపడ్డారు. వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం పార్టీ (ఆర్జేడీ) సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తోంది. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని ఎక్స్‌ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.‘వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించడం, సామాజిక న్యాయం కోసం మన సమిష్టి పోరాటాన్ని బలహీన పరుస్తుంది. పెద్ద కుమారుడి కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేవు. అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల కారణంగా, నేను అతన్ని ఆరేళ్ల పార్టీ పార్టీతో పాటు కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాను. నేటి నుంచి పార్టీకి, కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆరేళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరిస్తున్నాను’ అని లాలూ యాదవ్ హిందీలో రాసిన పోస్ట్‌లో తెలిపారు.కాగా, తేజ్‌ ప్రతాప్‌ 2018లో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్‌ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే, వీరి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Ktr Meets Kcr At Erravalli Farmhouse10
ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్‌.. కవిత లేఖ నేపథ్యంలో కేసీఆర్‌తో భేటీపై ఆసక్తి

సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్‌ వెళ్లారు. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కవిత లేఖపై చర్చ జరిగినట్లు సమాచారం. కవిత లేఖ నేపథ్యంలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. సుమారు గంటన్నర సాగిన ఈ సమావేశంలో కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరిచి క్యాడర్‌ను గందరగోళానికి గురి చేశారని కేసీఆర్‌కు కేటీఆర్‌ వివరించినట్టు సమాచారం.కాగా, కవిత లేఖ బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం రేపుతోంది. ‘కేసీఆర్‌ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుందంటూ నిన్న(శనివారం) జరిగిన సమావేశంలో కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.‘‘ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్‌ఎస్‌లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement