Pak Vs Eng: Pakistan Pace Bowler Naseem Shah Ruled Out Of 3rd Test Due To Injury - Sakshi
Sakshi News home page

ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌..

Published Wed, Dec 14 2022 11:33 AM | Last Updated on Wed, Dec 14 2022 12:58 PM

Pakistan Pace Bowler Naseem Shah Out Of Third England Test - Sakshi

ము‍ల్తాన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తద్వారా 22 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో పాక్‌ కోల్పోయింది. ఈ క్రమంలో కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని బాబర్‌ సేన భావిస్తోంది.

అయితే మూడో టెస్టుకు ముందు పాకిస్తాన్‌ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అతడు మూడో టెస్టుకు దూరం కానున్నట్లు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

"కరాచీలో జరగనున్న మూడువ టెస్టుకు నసీం షా భుజం గాయం కారణంగా దూరం కానున్నాడు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అతడు ప్రస్తుతం లాహోర్‌లోని నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఉన్నాడు"  అని పీసీబి పేర్కొంది. ఇక ఇప్పటికే ఆ జట్టు స్టార్‌ బౌలర్లు షాహీన్‌ షా అఫ్రిది, ,హారీస్‌ రౌఫ్‌ గాయం కారణంగా ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌కు దూరంమైన సంగతి తెలిసిందే. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు కరాచీ వేదికగా డిసెంబర్‌ 17 నుంచి జరగనుంది.
చదవండిAndrew Flintoff: కారు ప్రమాదంలో ఆండ్రూ ఫ్లింటాఫ్‌కు తీవ్ర గాయాలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement