ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. స్వర్ణ పతక ఆశలు రేపిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపిందని వార్తా సంస్థ ANI ఎక్స్ వేదికగా వెల్లడించింది.
కాగా హర్యానాకు చెందిన వినేశ్ ఫొగట్ రీర్ ఆరంభం నుంచి 53 కేజీల కేటగిరీలోనే పోటీ పడింది. అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో 50 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. రెజ్లింగ్‌లో ఇలా కేటగిరీ మారడం... అందులోనూ తక్కువ బరువుకు మారి రాణించడం అంత సులువు కాదు. అయినప్పటికీ ప్యారిస్‌లో అసాధారణ విజయాలతో వినేశ్ ఫైనల్ వరకు చేరింది.
వరల్డ్ నంబర్ వన్‌ను ఓడించి
ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత సుసాకీ(జపాన్)ని ఓడించిన వినేశ్.. క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సానా లివాచ్‌పై గెలుపొందింది. తద్వారా సెమీస్ చేరి.. అక్కడ 5–0తో పాన్ అమెరికన్ గేమ్స్ చాంపియన్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌ను మట్టికరిపించింది. ఫలితంగా భారత రెజ్లింగ్ చరిత్రలో తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
ఈరోజు రాత్రి పసిడి పతకం కోసం వినేశ్.. అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాంట్‌తో తలపడాల్సి ఉంది. అయితే, వినేశ్ ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉన్నట్లు తేలడంతో ఆమెపై వేటు పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పతకానికి ఈ రెజ్లర్ దూరం కానుంది.
చింతిస్తున్నాం
‘‘50 కేజీల విభాగంలో ఉన్న వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడినట్లు తెలిపేందుకు చింతిస్తున్నాం. 50 కిలోల కంటే ఆమె కాస్త ఎక్కువ బరువే ఉన్నారని తేలింది. రాత్రి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉదయం ఆమె ఉండవలసిని దాని కంటే అధిక బరువు ఉన్నారు కాబట్టి అనర్హత వేటు పడింది.
వినేశ్ గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాం’’ అని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపింది. ‘‘వినేశ్ 50 కిలోల కంటే 100 గ్రాములు అధిక బరువు ఉన్నారు. ఫలితంగా నిబంధనల ప్రకారం.. ఆమె పోటీ నుంచి వైదొలగాల్సి ఉంటుంది’’ అని భారత కోచ్ ఒకరు పీటీఐతో వ్యాఖ్యానించారు.
Indian Wrestler Vinesh Phogat disqualified from the Women’s Wrestling 50kg for being overweight.
It is with regret that the Indian contingent shares news of the disqualification of Vinesh Phogat from the Women’s Wrestling 50kg class. Despite the best efforts by the team through… pic.twitter.com/xYrhzA1A2U— ANI (@ANI) August 7, 2024
Comments
Please login to add a commentAdd a comment