సెయింట్ లూయిస్ (అమెరికా): సింక్‌ఫీల్డ్ కప్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ టోర్నమెంట్‌ను భారత గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేశ్ అజేయంగా ముగించారు. చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌లను కూడా వీరిద్దరు ‘డ్రా’ చేసుకోవడం విశేషం. ఎనిమిదో రౌండ్‌లోనే టైటిల్‌ను ఖరారు చేసుకున్న అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్)తో జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ప్రజ్ఞానంద 47 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
వెస్లీ సో (అమెరికా)తో జరిగిన గేమ్‌ను గుకేశ్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరిగిన ఈ టోరీ్నలో ప్రజ్ఞానంద, గుకేశ్, వెస్లీ సో 4.5 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలిచారు.
మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... ప్రజ్ఞానందకు ఐదో స్థానం, గుకేశ్‌కు ఆరో స్థానం, వెస్లీ సోకు ఏడో స్థానం ఖరారయ్యాయి. 6 పాయింట్లతో అలీరెజా ఫిరూజా టైటిల్‌ను దక్కించుకోగా...5.5 పాయింట్లతో ఫాబియానో కరువానా (అమెరికా) రన్నరప్‌గా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment