ఇండోర్ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ సంచలన త్రోతో మెరిశాడు. దూకుడుగా ఆడుతోన్న దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్‌ను అయ్యర్ అద్భుతమైన త్రోతో రనౌట్‌గా పెవిలియన్ పంపాడు. ప్రోటీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్‌లో డికాక్ మిడ్ వికెట్ దిశగా షాట్ ఆడాడు.
ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ పరిగెత్తుకుంటూ బంతిని అందుకుని వికెట్ కీపర్‌కు త్రో చేశాడు. వెంటనే వికెట్ కీపర్ పంత్ వికెట్లను గిరాటేశాడు. దీంతో డికాక్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదర్కొన్న డికాక్ 68 పరుగులు చేశాడు. అదే విధంగా మరో దక్షిణాఫ్రికా ఆటగాడు రిలీ రుసౌవ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022కు ముందు భారత్, దక్షిణాఫ్రికాకు ఇదే అఖరి టీ20 మ్యాచ్. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఆక్టోబర్6న ఆస్ట్రేలియాకు వెళ్లనుండగా.. దక్షిణాఫ్రికా మాత్రం వన్డే సిరీస్ అనంతం పయనం కానుంది.
చదవండి: IND vs SA: శబాష్ దీపక్ చాహర్.. రనౌట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ..!
Comments
Please login to add a commentAdd a comment