ధోనీ సిక్స్‌కు కూతురు జీవా షా​క్‌.. వీడియో వైరల్‌ | Reaction of Dhonis Wife and Cute Daughter Jeeva after the Winning Six | Sakshi
Sakshi News home page

SRH VS CSK: ధోనీ సిక్స్‌కు కూతురు జీవా షా​క్‌.. వీడియో వైరల్‌

Published Fri, Oct 1 2021 4:19 PM | Last Updated on Fri, Oct 1 2021 4:51 PM

Reaction of Dhonis Wife and Cute Daughter Jeeva after the Winning Six - Sakshi

Reaction of Dhoni's Wife and Cute Daughter Jeeva:  ఐపీఎల్‌ 2021లో వరస విజయాలతో చెన్నై సూపర్‌కింగ్స్‌ జైత్ర యాత్ర కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది. షార్జాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 11 మ్యాచ్‌లాడిన చెన్నై ఏకంగా 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.  ఈ మ్యాచ్‌లో  చెన్నై విజయానికి చివరి 3 బంతుల్లో 2 పరుగులు అవసరమవగా.. సిద్ధార్థ్ కౌల్ వేసిన బంతిని ధోనీ తనదైన స్టైల్లో సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు.

దాంతో.. తనలో అసలైన ఫినిషర్‌ ఇంకా మిగిలే ఉన్నాడంటూ ధోనీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో  మ్యాచ్‌ని స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా వీక్షించిన అతడి సతీమణి సాక్షి, కూతురు జీవా రియాక్షన్ సోషల్‌ మీడియోలో వైరల్‌గామారింది. ఇక ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న ధోని.. ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ సాయంతో 14 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

చదవండి: MS Dhoni: చాలు సామీ.. చాలు.. ఫినిషర్‌ ఇంకా బతికే ఉన్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement