ENG Vs IND Test 2022: Rohit Sharma Joins Team For First Training Session In Leicestershire - Sakshi
Sakshi News home page

ENG vs IND: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్‌!

Published Tue, Jun 21 2022 8:34 AM | Last Updated on Tue, Jun 21 2022 10:25 AM

Rohit Sharma joins team for first training session in Leicestershire - Sakshi

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ కోసం భారత్‌ సన్నాహలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా లీసెస్టర్‌షైర్‌ వేదికగా జూన్‌ 24న నుంచి 27 వరకు జరిగే నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కౌంటీ క్లబ్‌తో భారత్‌ తలపడనుంది. ఈ క్రమంలో లీసెస్టర్‌షైర్‌ చేరుకున్నభారత జట్టు ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది.  నెట్స్‌లో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను లీసెస్టర్‌షైర్‌ కౌంటీ క్లబ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా ఇంగ్లండ్‌ చేరుకున్నాక తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పాల్గొన్నాడు. అంతకుముందు టీమిండియా టెస్టు స్పెషలిస్టులతో లండన్‌లో రెండు రోజుల ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొం‍ది. తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ రోహిత్‌ దూరమయ్యాడు.

విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్ పుజారా, శార్దూల్ ఠాకూర్‌లతో కూడిన తొలి బ్యాచ్ ముంబై నుంచి జూన్ 16న లండన్‌కు చేరుకుంది. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం తొలి బ్యాచ్‌ వచ్చిన ఒక్క రోజు తర్వాత ఇంగ్లండ్‌ చేరుకున్నాడు. మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో పాల్గొన్న శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ త్వరలోనే టెస్టు జట్టులోకి చేరనున్నారు. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య నిర్ణయాత్మక టెస్టు మ్యాచ్ జులై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది. కరోనా వ్యాప్తి వల్ల గతేడాది 5 టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్ తాత్కాలికంగా రద్దయిన సంగతి తెలిసిందే.
చదవండి: 'ట్విటర్‌కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు.. అప్పుడే జట్టులోకి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement