టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ మధ్య విభేదాలు ఉన్నాయని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియా కోడై కూస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలకు షమీ గాయం కారణమని తెలుస్తుంది. దైనిక్ జాగారణ్ నివేదిక మేరకు.. రోహిత్-షమీ మధ్య విభేదాలకు భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ సందర్భంగా బీజం పడింది. ఆ సిరీస్‌లోని తొలి టెస్ట్‌కు ముందు షమీ గురించి రోహిత్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
షమీ ఫిట్‌గా లేడని, అతడి మోకాలి భాగంలో వాపు వస్తుందని రోహిత్ మీడియాకు వివరణ ఇచ్చాడు. మరోవైపు షమీ మాత్రం తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించాడు. ఇదే విషయమై రోహిత్-షమీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తుంది. తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నప్పుడు తప్పుడు స్టేట్‌మెంట్లు ఎందుకు ఇస్తున్నావని షమీ రోహిత్‌ను నిలదీశాడట.
తాజాగా మరోసారి అదే స్టేట్‌మెంట్
అడిలైడ్ టెస్ట్‌లో టీమిండియా పరాజయం అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. షమీ మోకాలు మళ్లీ వాచిందని, గాయాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పాడు. షమీ కోసం టీమిండియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని అన్నాడు. అయితే గాయం పూర్తిగా తగ్గకముందే బరిలోకి దింపి షమీని ఒత్తిడిలోకి నెట్టదలచుకోవడం లేదని అన్నాడు. రోహిత్ గతంలోనూ షమీపై ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ వ్యాఖ్యలకు భిన్నంగా..
ఓ పక్క రోహిత్ శర్మనేమో షమీ పూర్తిగా ఫిట్‌గా లేడని స్టేట్‌మెంట్లు ఇస్తుంటే షమీ మాత్రం మైదానంలో అదరగొడుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో షమీ దుమ్మురేపుతున్నాడు. అంతకుముందు రంజీ ట్రోఫీలోనూ షమీ సత్తా చాటాడు. తాను ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో కూడా ఉన్నట్లు షమీ మెసేజ్ పంపుతున్నాడు.
తాజాగా చండీఘడ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో షమీ ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టాడు. 17 బంతుల్లోనే 32 పరుగులు చేయడటమే కాకుండా బౌలింగ్‌లో 13 డాట్ బాల్స్ వేసి ఓ వికెట్ తీశాడు. రోహిత్ చెబుతున్నట్టు షమీకి గాయం తిరగబెడితే అతను విశ్రాంతి తీసుకోవాలి కాని, బరిలోకి దిగి ఇంత మెరుగ్గా ఎలా ఆడగలడు. ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment