సీఎస్‌కే జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. గతేడాది సీజన్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. శ్రీలంకతో టి20 సిరీస్‌కు ప్రారంభానికి ముందు రుతురాజ్ చేతి గాయంతో దూరమయ్యాడు. గాయం తగ్గినప్పటికి రుతురాజ్‌కు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీజన్ తొలి వారంలో సీఎస్‌కే ఆడబోయే మ్యాచ్‌లకు రుతురాజ్ దూరం కానున్నాడు. ప్రస్తుతం రుతురాజ్ బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు.
ఇదే విషయంపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. రుతురాజ్ మార్చి 17 లేదా 18న సూరత్‌లోని సీఎస్‌కే జట్టుతో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆరంభంలో రుతురాజ్ సీఎస్‌కే ఆడే మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేశాడా అన్నదానిపై కాశీ విశ్వనాథన్.. ''ఇంకా లేదు.. మరో రెండు రోజుల్లో ఫిట్‌నెస్ పరీక్షకు వెళ్లనున్నాడు.'' అని పేర్కొన్నాడు. కాగా సీఎస్‌కేకు చెందిన మరో బౌలర్ దీపక్ చహర్ కూడా ఎన్‌సీఏలో ఉన్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో భుజం గాయంతో ఇబ్బందిపడిన చహర్ లంకతో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే సీజన్ ప్రారంభంలోగా దీపక్ చహర్ సీఎస్‌కేలో చేరే అవకాశం ఉందని జట్టు యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.
చదవండి: IPL 2022- Shane Watson: 41 ఏళ్ల వాట్సన్ తొలిసారిగా..
Comments
Please login to add a commentAdd a comment