టోక్యో ఒలింపిక్స్‌కు స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ అర్హత | Sajan Prakash Becomes First-Ever Indian Swimmer To Make Olympic | Sakshi
Sakshi News home page

టోక్యో ఒలింపిక్స్‌కు స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ అర్హత

Published Sun, Jun 27 2021 6:21 AM | Last Updated on Sun, Jun 27 2021 6:21 AM

Sajan Prakash Becomes First-Ever Indian Swimmer To Make Olympic - Sakshi

ఒలింపిక్స్‌ స్విమ్మింగ్‌లో ‘ఎ’ అర్హత ప్రమాణాన్ని అధిగమించిన తొలి భారతీయ స్విమ్మర్‌గా సజన్‌ ప్రకాశ్‌ గుర్తింపు పొందాడు. రోమ్‌లో జరుగుతున్న సెట్టి కోలి ట్రోఫీ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో కేరళకు చెందిన సజన్‌ ప్రకాశ్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో ఈ ఘనత సాధించాడు. తద్వారా విశ్వ క్రీడలకు నేరుగా అర్హత పొందాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ హీట్‌లో సజన్‌ 1ని:56.38 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని పొందాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు టోక్యో ఒలింపిక్స్‌ ‘ఎ’ అర్హత ప్రమాణం 1ని:56.48 సెకన్లను అధిగమించి ఒలింపిక్‌ బెర్త్‌ సంపాదించాడు. 27 ఏళ్ల సజన్‌కిది వరుసగా రెండో ఒలింపిక్స్‌ కానుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో సజన్‌ 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో ఓవరాల్‌గా 28వ స్థానంలో నిలిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement