శరత్‌కు మరో పతకం
ఇంచియాన్: ఆసియా పారా గేమ్స్‌లో భారత స్విమ్మర్ శరత్ మహదేవరావు గైక్వాడ్ మూడో పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఈవెంట్‌లో శరత్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఇంతకుముందు ఈ క్రీడల్లోనే శరత్ 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో రజతం, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో కాంస్యం సాధించాడు. మూడో రోజున భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల జావెలిన్ త్రోలో నరేందర్ రజతం, మహిళల డిస్కస్‌త్రోలో కరమ్‌జ్యోతి కాంస్యం గెలిచారు. ఓవరాల్‌గా భారత్ 15 పతకాలతో (2 స్వర్ణాలు, 6 రజతాలు, 7 కాంస్యాలు) 13వ స్థానంలో ఉంది.