
Courtesy: IPL Twitter
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు షిమ్రన్ హెట్‌మైర్ తండ్రైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్‌మైర్ టోర్నీ మధ్యలోనే జట్టును వీడాడు. కాగా తన స్వస్థలమైన గయానాకు చేరుకున్న హెటమైర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశాడు.
"ఈ ప్రపంచానికి స్వాగతం, చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. మా దేవత నువ్వు" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. హెట్‌మైర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా త్వరలోనే రాజస్తాన్ జట్టుతో హెట్‌మైర్ చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది సీజన్‌లో హెట్‌మైర్ అద్భతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు హెట్‌మైర్ 11 మ్యాచ్‌లాడి 291 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
చదవండి: World Cup Super League: హోల్డర్‌కు విశ్రాంతి.. నెదర్లాండ్స్, పాక్‌తో సిరీస్‌కు విండీస్ జట్టు ఇదే!
Many congratulations to Shimron Hetmyer on becoming a father. pic.twitter.com/BwoLpsNcbs
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2022