IPL 2022: Shimron Hetmyer Rejoins Rajasthan Royals Bubble Ahead RR Vs CSK Clash - Sakshi
Sakshi News home page

IPL 2022 RR Vs CSK: రాజస్థాన్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు

Published Mon, May 16 2022 4:52 PM | Last Updated on Mon, May 16 2022 5:44 PM

Shimron Hetmyer rejoins Rajasthan Royals bubble - Sakshi

Courtesy: IPL Twitter

రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్‌ తిరిగి జట్టు బయో-బబుల్‌లో చేరాడు. మే 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న రాజస్తాన్‌ తదుపరి మ్యాచ్‌కు హెట్‌మైర్‌ అందుబాటులో ఉండనున్నాడు. కాగా తన భార్య మగ బిడ్డకు జన్మనివ్వడంతో జట్టు బయో-బబుల్‌ను వీడి హెట్‌మైర్‌ స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సీజన్‌లో హెట్‌మైర్‌ అద్భతంగా రాణిస్తున్నాడు.

ఇప్పటివరకు హెట్‌మైర్‌ 11 మ్యాచ్‌లాడి 291 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ల్లో  8 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది.

చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ, పంజాబ్‌ మధ్య బిగ్‌ ఫైట్‌.. తుది జట్లు ఎలా ఉండబోతున్నాయంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement