PC: BCCI
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా ముగించింది. ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావించిన భారత్‌కు విండీస్ షాకిచ్చింది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి క్లీన్ స్వీప్ నుంచి కరేబియన్ జట్టు తప్పించుకుంది. చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయినప్పటికీ, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు మాత్రం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కే దక్కింది.
గిల్ మూడో వన్డేలో విఫలమైనప్పటికి తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీలతో చెలరేగాడు. ఈ సిరీస్‌లోని 3 ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 334 పరుగులు సాధించాడు. దీంతో గిల్ ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సార్లు (7 సార్లు) ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలుచుకున్న మూడో ఆటగాడిగా దిగ్గజాలు యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ సరసన నిలిచాడు.
యువీ, ధోనీ, గంగూలీలు కూడా ఏడేసి సార్లు ఈ అవార్డును గెలుచుకోగా, గిల్ కేవలం 70 వన్డేల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. త్వరలో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో గిల్ రాణిస్తే, వీరి రికార్డును అధిగమించి రెండో స్థానంలోకి వెళ్లే అవకాశముంది.
చదవండి: IND vs PAK: 'అతడు పేరుకే స్పిన్నర్.. చూస్తుంటే నవ్వొస్తోంది"


