
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ ఫాస్ట్ బౌలర్ విలియమ్ ఓరూర్కీ ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/55) చెలరేగాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 305 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 302/7 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మరో మూడు పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లు కోల్పోయింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఒక ఓవర్ ముగిసిన అనంతరం వికెట్ నష్టపోకుండా ఐదు పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. టామ్ లాథమ్ 1, డెవాన్ కాన్వే 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
కమిందు సెంచరీ
తొలి ఇన్నింగ్స్‌లో కమిందు మెండిస్ (114) సూపర్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా శ్రీలంక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. వికెట్‌కీపర్ కుసాల్ మెండిస్ (50) అర్ద సెంచరీతో రాణించాడు. కివీస్ బౌలర్లలో రూర్కీ ఐదేయగా.. అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ తలో రెండు, సౌథీ ఓ వికెట్ పడగొట్టారు.
చదవండి: SL vs NZ: శతక్కొట్టిన కమిందు మెండిస్.. శ్రీలంక తొలి ప్లేయర్‌గా..
Comments
Please login to add a commentAdd a comment