టీమిండియా టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెబుతూ విరాట్ కోహ్లి తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టును అగ్రపథంలో నిలపడంలో విరాట్ ఎనలేని కృషి చేశాడన్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయమని, బీసీసీఐ దీనిని గౌరవిస్తుందని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత తాను టీమిండియా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు కోహ్లి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడం వల్లే జట్టు ప్రయోజనాల దృష్ట్యా తీ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే, ఆటగాడిగా మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ విషయంపై ట్విటర్ వేదికగా స్పందించిన గంగూలీ... ‘‘విరాట్ నాయకత్వంలో భారత క్రికెట్ అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. తన వ్యక్తిగత నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తోంది. జట్టులో తను కీలక సభ్యుడు. భవిష్యత్తులో టీమ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషిస్తాడనే భావిస్తున్నా. గొప్ప ఆటగాడు. వెల్‌డన్’’ అంటూ కోహ్లిని ప్రశంసించాడు.
కాగా కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న తర్వాత.. బీసీసీఐ అతడిని వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన కోహ్లి తనను సంప్రదించకుండానే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని, గంగూలీ కూడా ఈ విషయం గురించి తనతో చర్చించలేదని తెలిపాడు. ఈ క్రమంలో బోర్డుతో అతడికి అభిప్రాయ భేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు టెస్టు కెప్టెన్సీకి కోహ్లి తన అంతట తానుగా గుడ్ బై చెప్పడం గమనార్హం.
చదవండి: Virat Kohli: ఆ కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..!
కోహ్లి సంచలన నిర్ణయంపై బీసీసీఐ స్పందన
Under Virats leadership Indian cricket has made rapid strides in all formats of the game ..his decision is a personal one and bcci respects it immensely ..he will be an important member to take this team to newer heights in the future.A great player.well done ..@BCCI @imVkohli
— Sourav Ganguly (@SGanguly99) January 15, 2022
Comments
Please login to add a commentAdd a comment