South Africas batting is pretty vulnerable Karthik backs India to win: దక్షిణాఫ్రికా పర్యటనకు త్వరలో భారత్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ టెస్ట్ సిరీస్‌పై అసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ పర్యటనలో తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంటుందని కార్తీక్ జోస్యం చెప్పాడు. టీమిండియా.. ఫాస్ట్ బౌలింగ్ లైనప్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కారణంగా టీమిండియా కచ్ఛింతంగా విజయం సాధిస్తుందని థీమా వ్యక్తం చేశాడు.
దక్షిణాఫ్రికాపై విజయం సాధించడానికి భారత్‌కు ఇదే అత్యుత్తమ అవకాశం. ఎందకుంటే టీమిండియాకు ఫాస్ట్ బౌలింగ్ లైనప్, పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. ఇక దక్షిణాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉంది. కానీ రబడ, నార్ట్జేలతో కూడిన అద్బుతమైన బౌలింగ్ విభాగం ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లను భారత్ ఎదుర్కుంటే చాలు. కాగా చివరిసారిగా 2018లో దక్షిణాఫ్రికాకు పర్యటనకు వెళ్లిన భారత్ ఒకే ఒకే టెస్ట్‌లో విజయం సాధించింది.
ఇక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ గురించి మాట్లాడూతూ.. "బ్యాటింగ్ లైనప్ చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా క్వింటన్ డికాక్, టెంబా బవుమాపైనే జట్టు బ్యాటింగ్ ఆదారపడి ఉంది. వీరిద్దరనీ త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు విజయం తిరిగి ఉండదు. అంతేకాకుండా కొంతమంది ఆటగాళ్లకి అంతర్జాతీయ స్ధాయిలో అంతగా ఆడిన అనుభవం లేదు. కాబట్టి భారత్ వంటి మేటి జట్టుపై రాణించడం అంత సులభంకాదు. కనుక దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొలి సారి సిరీస్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నాను "అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. కాగా డిసెంబర్26న సెంచూరియన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.
చదవండి: Pakistan Players Clash Video: డ్రెస్సింగ్‌రూంలో పాక్ ఆటగాళ్ల ‘గొడవ’.. బాబర్ ఆజం ప్రతీకారం!
Comments
Please login to add a commentAdd a comment