షార్జా: రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ఆర్సీబీ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం ఆర్సీబీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ ఐదు విజయాలతో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటివరకూ ఇరుజట్లు 15సార్లు ముఖాముఖి పోరులో తలపడితో ఎస్‌ఆర్‌హెచ్ 8 విజయాలు సాధించగా, ఆర్సీబీ 7 విజయాలు నమోదు చేసింది.
ఇరుజట్లు తాము ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలు సాధించి, మూడు ఓటములు చవిచూశాయి. ఈ మ్యాచ్ ఇరుజట్లకు చాలా కీలకం. ఆర్సీబీ గెలిస్తే ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ గెలిస్తే రేసులో నిలుస్తుంది. ప్రస్తుత మ్యాచ్‌తో పాటు, ముంబై ఇండియన్స్ తో ఆడబోయే తదుపరి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ గెలిస్తేనే ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ రన్‌రేట్ 0.396గా ఉంది. అంటే కింగ్స్ పంజాబ్ కంటే మెరుగ్గా ఉంది సన్‌రైజర్స్. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఆర్సీబీ, ఢిల్లీల కంటే సన్‌రైజర్స్ రన్‌రేట్ బాగుండటం వారికి సానుకూలాంశం.
సన్‌రైజర్స్ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో డేవిడ్ వార్నర్(370), మనీష్ పాండే(354), జోనీ బెయిర్ స్టో(345)లు టాప్ ఫెర్ఫార్మెర్స్‌గా ఉండగా, అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రషీద్ ఖాన్(17), నటరాజన్(13), సందీప్ శర్మ(8)లు వరుస స్థానాల్లో ఉన్నారు. ఇక ఆర్సీబీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లి(424), దేవదూత్ పడిక్కల్(417), ఏబీ డివిలియర్స్( 339)లు వరుస స్థానాల్లో ఉండగా, అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో యజ్వేంద్ర చహల్(18), క్రిస్ మోరిస్(11), ఇసురు ఉదానా(8)లు వరుస స్థానాల్లో ఉన్నారు.
ఆర్సీబీ
విరాట్ కోహ్లి(కెప్టెన్), జోష్ ఫిలెఫ్పి, దేవదూత్ పడిక్కల్, ఏబీ డివిలియర్స్, గుర్‌కీరత్ సింగ్‌మన్, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, ఇసురు ఉదానా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, యజ్వేంద్ర చాహల్
ఎస్‌ఆర్‌హెచ్
డేవిడ్ వార్నర్(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సామద్, జేసన్ హోల్డర్, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, షహబాజ్ నదీమ్, సందీప్ శర్మ, నటరాజన్
Comments
Please login to add a commentAdd a comment