ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ.. ఆయా ప్రాంఛైజీలు మాత్రం తమ సన్నాహకాలను మొదలు పెట్టేశాయి. ఐపీఎల్ 2024 సీజన్‌కి సంబంధించిన ట్రేడింగ్ విండో నవంబర్ 1న ఓపెన్ అయ్యింది. ఈ క్రమంలో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ట్రేడింగ్ రూపంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.
రూ. 50లక్షల బేస్ ఫ్రైస్‌కు అతడితో ముంబై ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు షెపర్డ్ కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
కాగా ఐపీఎల్-2024కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 12న దుబాయ్ వేదికగా జరగనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవంబర్ 15లోపు ప్రాంఛైజీలు రిటైన్, విడుదల చేయాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితాలను సమర్పించాలి. "ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ట్రేడింగ్ విండోలో భాగంగా రొమారియో షెపర్డ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) నుంచి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది అంటూ" ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్ తర్వాత బెన్ స్టోక్స్‌కు సర్జరీ.. ఏమైందంటే?
🚨 DEAL DONE:
— Haroon 🏏🌠 (@HaroonM33120350) November 3, 2023
Mumbai Indians get the first transfer from Lucknow super giants of INR 50 Lakhs. Romario Shepherd will play for Mumbai Indians in IPL 2024.#IPL2024 #IPLpic.twitter.com/ERFNazE3Z7
Comments
Please login to add a commentAdd a comment