ఖజాన్ సింగ్ (ఫైల్)
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ), అంతర్జాతీయ మాజీ స్విమ్మర్ ఖజాన్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఖజాన్‌తోపాటు మరో కోచ్, ఇన్‌స్పెక్టర్ సుర్జీత్ సింగ్‌ను సస్పెండ్ చేసినట్లు సీఆర్‌పీఎఫ్ సీనియర్ అధికారి వెల్లడించారు. గత డిసెంబర్‌లో ఖజాన్‌పై మహిళా కానిస్టేబుల్ ఢిల్లీలోని బాబా హరిదాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తనపై ఖజాన్, సుర్జీత్ అత్యాచారం చేశారని, సీఆర్‌పీఎఫ్‌లోని పలువురు మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. దీంతో విచారణ కమిటీ ఏర్పాటు చేయగా... విచారణ లో వారిద్దరూ దోషులుగా తేలారు. దీంతో ఖజాన్, సుర్జీత్ సస్పెన్షన్‌కు గుర య్యారు. 56 ఏళ్ల ఖజాన్ సింగ్ 1986 సియోల్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. పతకంతో దేశానికి పేరుతెచ్చిన అతనికి సీఆర్‌పీఎఫ్‌లో స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ఉద్యోగమిచ్చారు. 1984లో ‘అర్జున’ అవార్డు పొందిన ఖజాన్ 1988 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1988 వరల్డ్ పోలీస్ గేమ్స్‌లో రజతం, 1989 దక్షిణాసియా క్రీడల్లో ఏడు స్వర్ణాలు సాధించాడు.
1986 ఆసియా క్రీడల్లో రజత పతకంతో ఖజాన్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment