సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023ను కేరళ జట్టు విజయంతో ఆరంభించింది. ముంబై వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో కేరళ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేరళ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కేరళ బ్యాటర్లలో విష్ణు వినోద్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సచిన్ బేబీ(30), నైజర్(23) పరుగులతో రాణించారు.
నిరాశపరిచిన సంజూ..
ఫామ్ లేమితో భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన వికెట్ కీపర్ బ్యాటర్, కేరళ కెప్టెన్ సంజూ శాంసన్.. హిమాచల్ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం ఒక్కపరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. హిమాచల్ బౌలర్ ముకల్ నేగీ బౌలింగ్‌లో సంజూ ఔటయ్యాడు.
చెలరేగిన వినోద్ కుమార్, శ్రేయస్ గోపాల్..
ఇక 164 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన హిమాచల్ ప్రదేశ్ 128 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో వినోద్ కుమార్, శ్రేయస్ గోపాల్ తలా 4 వికెట్లతో హిమాచల్ పతనాన్ని శాసించారు. హిమాచల్ ప్రదేశ్ బ్యాటర్లలో నికిల్ గంగటా(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: SMT 2023: 3 వికెట్లు పడగొట్టిన అర్జున్ టెండూల్కర్.. పోరాడి ఓడిన ఆంధ్ర
Comments
Please login to add a commentAdd a comment