T20 World Cup 2022: BCCI Announces Shami Replaces Bumrah In Indian Squad - Sakshi
Sakshi News home page

Jasprit Bumrah Replacement: బుమ్రా స్థానంలో వరల్డ్‌కప్‌ ఆడేది అతడే: బీసీసీఐ ప్రకటన

Published Fri, Oct 14 2022 5:30 PM | Last Updated on Fri, Oct 14 2022 6:19 PM

T20 WC 2022: BCCI Announces Shami Replaces Bumrah In Indian Squad - Sakshi

జస్‌ప్రీత్‌ బుమ్రా

T20 World Cup 2022- Jasprit Bumrah Replacementటీ20 ప్రపంచకప్‌-2022 జట్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా స్థానాన్ని భర్తీ చేయనున్న బౌలర్‌ పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి వెల్లడించింది. సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని బుమ్రా స్థానంలో ఈ మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఆల్‌ ఇండియా సీనియర్‌​ సెలక్షన్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌ సమయంలో ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌లలో ఎవరో ఒకరిని అతడి స్థానంలో సెలక్ట్‌ చేస్తారని భావించగా.. యాజమాన్యం సీనియర్‌ షమీ వైపే మొగ్గు చూపింది.


మహ్మద్‌ షమీ(PC: BCCI)

ఇక సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా కరోనా బారిన పడిన షమీ పూర్తిగా కోలుకున్నాడు. స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న అతడు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకోగా.. తాజాగా ప్రధాన జట్టులో చేరుస్తూ బీసీసీఐ ప్రకటన వెలువరించింది. 

మరోవైపు.. బ్యాకప్‌ ప్లేయర్లుగా ఎంపికైన మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ త్వరలోనే ఆస్ట్రేలియాకు చేరుకోనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. వరల్డ్‌కప్‌ టోర్నీ-2022లో అక్టోబరు 23న పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. కాగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న షమీ ఈ ఐసీసీ టోర్నీలో ఏ మేరకు రాణిస్తాడో చూడాలి మరి!

టీ20 ప్రపంచకప్‌-2022- భారత జట్టు(అప్‌డేట్‌):
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్‌ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్‌ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌, మహ్మద్ షమీ.

చదవండి: Jasprit Bumrah Replacement: బుమ్రా స్థానంలో షమీ కాదు.. అతడే బెటర్‌.. ఎందుకంటే: టీమిండియా దిగ్గజం
T20 world cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌.. పంత్‌కు నో ఛాన్స్‌! కా‍ర్తీక్‌ వైపే మొగ్గు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement