పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్ పేరిట ఓ చెత్త రికార్డు కొనసాగుతుంది. మెగా టోర్నీలో అత్యధిక పరాజయలు చవిచూసిన జట్టుగా ఘోర అపవాదును మూటగట్టుకుంది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 10) సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న బంగ్లాదేశ్.. మెగా టోర్నీల్లో తమ పరాజయాల సంఖ్యను 29కి పెంచుకుని, అప్పటికే తమ పేరిట ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.
బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక వరల్డ్‌కప్ పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక ఉంది. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో శ్రీలంక ఇప్పటివరకు 21 అపజయాలను ఎదుర్కొంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక తర్వాత ఇంగ్లండ్ (20), పాకిస్తాన్ (19), న్యూజిలాండ్ (18), వెస్టిండీస్ (18), ఐర్లాండ్ (17), ఆఫ్ఘనిస్తాన్ (15), ఆస్ట్రేలియా (15), ఇండియా (15), సౌతాఫ్రికా (15) ఉన్నాయి.
అంతర్జాతీయ టీ20ల మొత్తంలో చూసినా అత్యధిక పరాజయాల చెత్త రికార్డు బంగ్లాదేశ్ పేరిటే ఉంది. ఇప్పటివరకు 171 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆ జట్టు 101 మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ తర్వాత సెంచరీ అపజయాలు ఎదుర్కొన్న ఏకైక జట్టుగా శ్రీలంక ఉంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన 191 టీ20ల్లో 100 పరాజయాలను నమోదు చేసింది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరాజయాలు నమోదు చేసిన టెస్ట్ ప్లేయింగ్ దేశాలు ఇవే..
ఆఫ్ఘనిస్తాన్- 132 మ్యాచ్‌ల్లో 48 పరాజయాలు
ఆస్ట్రేలియా- 190 మ్యాచ్‌ల్లో 81 పరాజయాలు
బంగ్లాదేశ్- 171 మ్యాచ్‌ల్లో 101 పరాజయాలు
ఇంగ్లండ్- 186 మ్యాచ్‌ల్లో 81 పరాజయాలు
భారత్- 221 మ్యాచ్‌ల్లో 68 పరాజయాలు
ఐర్లాండ్- 168 మ్యాచ్‌ల్లో 88 పరాజయాలు
న్యూజిలాండ్- 217 మ్యాచ్‌ల్లో 91 పరాజయాలు
పాకిస్తాన్- 243 మ్యాచ్‌ల్లో 92 పరాజయాలు
సౌతాఫ్రికా-179 మ్యాచ్‌ల్లో 76 పరాజయాలు
శ్రీలంక- 191 మ్యాచ్‌ల్లో 100 పరాజయాలు
వెస్టిండీస్- 197 మ్యాచ్‌ల్లో 99 పరాజయాలు
జింబాబ్వే- 145 మ్యాచ్‌ల్లో 95 పరాజయాలు
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ బంగ్లాదేశ్ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన బంగ్లాదేశ్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment