Indian players participate in a training session: టీ20 ప్రపంచకప్2021 సూపర్-12లో భాగంగా ఆదివారం(ఆక్టోబర్-31)న భారత్.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌కు దాదాపు వారం రోజులు సమయం దొరకడంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను టీమిండియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి కొందరు క్రికెటర్లు “ఫన్ డ్రిల్”లో పాల్గొన్నట్లు ఫొటోలో కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే టీ20 ప్రపంచకప్‌ను భారత్, న్యూజిలాండ్ జట్లు పాక్ చేతిలో ఓటమితో ఆరంభించాయి. కాగా బాబర్ అజం సారథ్యంలోని పాక్ జట్టు 10 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: SL VS AUS: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
Comments
Please login to add a commentAdd a comment