
టాటా స్టీల్ చాలెంజర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ తొలి విజయం నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన అర్జున్ 25 ఎత్తుల్లో మాక్స్ వార్మెర్‌డమ్ (నెదర్లాండ్స్)పై గెలిచాడు. లుకాస్ వాన్ ఫారెస్ట్ (నెదర్లాండ్స్)తో జరిగిన తొలి గేమ్‌ను అర్జున్ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment