టైగర్‌వుడ్స్‌కు ట్రంప్‌ మాజీ భార్య వార్నింగ్‌! | Tiger Woods Partner Threatens To Leave Him After Car Crash Incident | Sakshi
Sakshi News home page

టైగర్‌వుడ్స్‌కు ట్రంప్‌ మాజీ భార్య వార్నింగ్‌!

Mar 30 2026 1:06 PM | Updated on Mar 30 2026 1:43 PM

Tiger Woods Partner Threatens To Leave Him After Car Crash Incident

గోల్ఫ్ దిగ్గ‌జం టైగ‌ర్ వుడ్స్ ప్ర‌స్తుతం డొనాల్డ్ ట్రంప్ జూనియ‌ర్ మాజీ భార్య వెనెస్సా ట్రంప్‌తో రిలేష‌న్‌షిప్‌లో ఉన్నాడు. ఇటీవ‌లే టైగ‌ర్‌వుడ్స్‌ను డ్రైవింగ్ అండ‌ర్ ది ఇన్‌ఫ్లుయెన్స్ (డీయూఐ) కింద ఫ్లోరిడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం టైగ‌ర్‌వుడ్స్‌ను మార్టిన్ కౌంటీ జైలుకు తీసుకెళ్లారు. 

ఆ త‌ర్వాత బెయిల్‌పై విడుద‌లయిన టైగ‌ర్‌వుడ్స్‌పై అత‌డి భాగ‌స్వామి వెనెస్సా ట్రంప్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఇప్ప‌టికైనా టైగ‌ర్‌వుడ్స్‌ తన ప్ర‌వ‌ర్త‌న‌, ప‌ద్ద‌తుల‌ను మార్చుకోకపోతే విడిచిపెట్టి వెళ్లిపోతానంటూ బెదిరింపుల‌కు దిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

డైలీమెయిల్ క‌థ‌నం ప్ర‌కారం.. వెనెస్సా ట్రంప్ టైగ‌ర్‌వుడ్స్‌కు ఇదే అత‌డికి చివ‌రి అవ‌కాశ‌మ‌ని, ఒక‌వేళ మ‌ళ్లీ ఎలాంటి త‌ప్పు చేసి జైలుకెళితే మాత్రం త‌మ రిలేష‌న్‌షిప్‌కు ఎండ్‌కార్డ్ ప‌డిన‌ట్లేన‌ని అర్థం చేసుకోవాల‌ని తెలిపింది. ‘ఇది కచ్చితంగా టైగర్‌వుడ్స్‌కు రెడ్ ఫ్లాగ్ వంటిది. సమస్యలన్నింటిని పరిష్కరించుకొని సక్రమంగా ఉంటే మంచిది. లేదంటే రిలేషన్‌షిప్‌కు ఎండ్‌కార్డ్ వేసి నా దారి నేను చూసుకోవాల్సి ఉంటుంది. ’ అని వెనెస్సా ఘాటుగానే హెచ్చరించినట్లు డైలీమెయిల్ పేర్కొంది.

కాగా అమెరికన్ మోడల్ అయిన వెనెస్సా ట్రంప్ 2005 నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌ను పెళ్లాడింది. 2018లో విడాకులు తీసుకున్న ఈ జంటకు కాయ్ ట్రంప్ సంతానం. ఆ తర్వాత గోల్ప్ దిగ్గజం టైగర్‌వుడ్స్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు 2024లో తొలిసారి వార్తలు బయటకొచ్చాయి. 

టైగర్‌వుడ్స్ మార్చి 2025లో వెనెస్సాను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారికంగా పోస్టు పెట్టాడు. అప్పటినుంచి ఈ ఇద్దరు లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తాజాగా టైగర్‌వుడ్స్ ప్రవర్తనతో విసిగిపోయిన వెనెస్సా మరోసారి ఇలా చేస్తే మాత్రం రిలేషన్ బ్రేకప్ చేసుకుంటానని బెదిరింపులకు దిగడం ఆసక్తిగా మారింది.

చదవండి:  అంతుచిక్క‌ని శార్దూల్ ఠాకూర్‌!

Advertisement
 
Advertisement
Advertisement