
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళా షూటర్ అవని లేఖారా 50 మీటర్ల ఎయిర్ రైఫిల్(SH1) విభాగంలో కాంస్య పతకం సాధించి భారత పతకాల సంఖ్య 12కు చేర్చింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన అవని.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అవని సాధించిన కాంస్య పతకంతో ఆమె మరో రికార్డును నెలకొల్పింది. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో జోగిందర్ సింగ్ బేడీ, మరియప్పన్ తంగవేళు, దేవేంద్ర ఝాజరియా తర్వాత ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 4వ భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది.
చదవండి: ప్రవీణ్ కూమార్‌కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు
Comments
Please login to add a commentAdd a comment