
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందపై వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్‌కు చేరిన ప్రజ్ఞానందను అభినందించారు. చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ మనందరినీ గర్వపడేలా చేశాడని కొనియాడారు.
వరల్డ్ నంబర్ 3ని ఓడించి.. ఫైనల్ పోరులో వరల్డ్ నంబర్ 1తో పోటీ పడుతున్న ప్రజ్ఞానందకు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా అజర్‌బైజాన్‌లోని బకూ వేదికగా టైటిల్ కోసం ప్రజ్ఞానంద- మాగ్నస్ కార్ల్‌సన్ మధ్య మంగళవారం పోరు ఆరంభమైంది.
కాగా అంతకుముందు ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 3.5–2.5తో విజయం సాధించాడు. తద్వారా ఫైనల్ చేరి.. వచ్చే ఏడాది జరుగనున్న క్యాండిడేట్ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు. ఇక భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా 18 ఏళ్ల ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు.
Comments
Please login to add a commentAdd a comment