PC: INside sport
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాక్-భారత్ మ్యాచ్‌కు సమయం అసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు దాయాదుల పోరు షూరూ కానుంది. గతేడాది ఇదే వేదికపై టీ20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్... ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
కాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు మరో ప్రత్యకేత కూడా ఉంది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన వందో అంతర్జాతీయ మ్యాచ్ కూడా పాక్‌పై ఆడనునున్నాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలు రాయిని కోహ్లి అందుకోనున్నాడు. అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ఆటగాడిగా కోహ్లి రికార్డులు ఎక్కనున్నాడు.
ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ ఉన్నాడు. 2020 లో టేలర్ ఈ అరుదైన ఘనత సాధించాడు. అదే విధంగా భారత తరపున అంతర్జాతీయ టీ20ల్లో 100 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా కోహ్లి నిలవనున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 132 మ్యాచ్‌లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
చదవండి: Asia Cup Ind Vs Pak: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు గుడ్ న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment