Virat Kohli Becomes First Player to Hit Century in 500th International Match - Sakshi
Sakshi News home page

Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలో తొలి ఆటగాడిగా

Published Fri, Jul 21 2023 9:05 PM | Last Updated on Fri, Jul 21 2023 9:27 PM

Virat Kohli Becomes First Player to Hit Century in 500th International Match - Sakshi

విదేశీ గడ్డపై సెంచరీ కోసం తన 55 నెలల నిరీక్షణకు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఎట్టకేలకు తెరదించాడు. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 181 బంతుల్లో 10 ఫోర్లు సాయంతో కోహ్లి తన 29వ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా కోహ్లికి ఇది 76వ అంతర్జాతీయ సెంచరీ కావడం గమనార్హం.

అదే విధంగా తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 206 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 121 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

కోహ్లి సాధించిన రికార్డులు ఇవే..
►500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా విరాట్‌ చరిత్ర సృష్టించాడు.

►అదే విధంగా నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు ఈ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి 25 సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో విండీస్‌ దిగ్గజం​ బ్రియాన్‌ లారా(24)ను రన్‌ మిషన్‌ అధిగమించాడు.

►వెస్టిండీస్‌పై అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు విండీస్‌పై 12 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో డివిలియర్స్‌(11) రికార్డును కోహ్లి బ్రేక్‌ చేశాడు.
చదవండి: Asia Cup 2023: బంగ్లాను చిత్తు చేసి.. పాకిస్తాన్‌ను ఫైనల్లో ఢీకొట్టనున్న భారత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement