![Virat Kohlis Sarcastic Response To Burgers Mitchell Johnson Esque Sledge - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/4/virat.jpg.webp?itok=yGXMtgeC)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫీల్డ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన హావభావాలతో ప్రత్యర్ధి ఆటగాళ్లను విరాట్ స్లెడ్జింగ్ చేయడం మనం చాలా సందర్బాల్లో చూశాం. అటువంటి కింగ్ ముందు దక్షిణాఫ్రికా యువ పేసర్ నండ్రీ బర్గర్ కుప్పిగంతులు వేశాడు. కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి తనదైన స్టైల్‌లో బర్గర్ కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.
ఏమి జరిగిందంటే?
14.2 ఓవర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మను బర్గర్ ఔట్ చేశాడు. రోహిత్ తర్వాత విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కు దిగాడు. అదే ఓవర్‌లో విరాట్ ఎదుర్కొన్న తొలి బంతినే బర్గర్ గుడ్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. కోహ్లి కూడా బంతి అద్బుతంగా ఆడి డిఫెండ్ చేశాడు. ఆ బంతిని నాన్‌స్టైక్‌లో ఎండ్‌లో బర్గర్ అందుకున్నాడు. అయితే కోహ్లి క్రీజులో ఉన్నప్పటికీ బర్గర్ అత్యుత్సహం ప్రదర్శించాడు.
అతడు బంతిని కోహ్లిపై విసురుతా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. కోహ్లి మాత్రం నవ్వుతూ క్రీజులో నిలబడిపోయాడు. ఆ తర్వాత కోహ్లి తనదైన శైలిలో బర్గర్‌కు సమాధానం చెప్పాడు. అదే ఓవర్‌లో వరుసగా బౌండరీలు బాది అతడిని ఒత్తిడిలోకి నెట్టాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 46 పరుగులు చేశాడు.
చదవండి: IND vs SA: ఒకే రోజు 23 వికెట్లు.. సచిన్ టెండూల్కర్ రియాక్షన్ ఇదే
— Cricket Videos (@cricketvid123) January 3, 2024
Comments
Please login to add a commentAdd a comment